Former Australia captain: టెస్ట్ కెప్టెన్సీ కి బుమ్రా బెటర్ ఆప్షన్..! 1 d ago
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ లో జరిగిన తొలి మ్యాచ్లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమ్ ఇండియా 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అడిలైడ్లో పింక్-బాల్ మ్యాచ్ అయిన రెండో టెస్టులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి భారత్‌కు నాయకత్వం వహించాడు. అయితే, ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఓటమిపాలైంది. బ్రిస్బేన్లో జరిగిన మూడో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ డ్రాతో గట్టెక్కింది. రోహిత్ శర్మ ఇటు బ్యాటర్ గానూ, అటు కెప్టెన్ గాను విఫలమవుతున్నాడు.ఈ నేపథ్యంలో టీమ్ ఇండియాకు బుమ్రా అద్భుతమైన కెప్టెన్సీ ఆప్షన్ అవుతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ పేర్కొన్నాడు. ‘బుమ్రా కెప్టెన్సీ బాగా చేస్తాడు. పెర్త్ టెస్టులో బుమ్రా తనను తాను సరిగ్గా ఉపయోగించుకున్నాడు. కెప్టెన్‌గా పర్ఫెక్ట్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. అతని బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది, అని తన అభిప్రాయం తెలిపారు.